సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి

సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలి

  • కుడ్మెత విశ్వనాథ్ రావు పిలుపు

జైనూర్, ఆంధ్రప్రభ:
జూన్ 1న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పాల్గొనే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు పిలుపునిచ్చారు.

బుధవారం జైనూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ముగింపు కార్యక్రమంలో భాగంగా సీఎం జిల్లాలో పర్యటించనున్నారని తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, చేయూత పథకం కింద అర్హులైన వారికి కొత్త పింఛన్లు మంజూరు ప్రక్రియను ఇక్కడ నుంచే ప్రారంభించనున్నారని పేర్కొన్నారు.

అలాగే బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని, సభలో ఈ ప్రాజెక్టుపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిపారు.

జిల్లా నలుమూలల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ ముఖీద్, మాజీ వైస్ ఎంపీపీలు షేక్ రషీద్, ఆత్రం ప్రకాష్, సర్పంచులు మడావి మనోహర్, తొడసం రాజేందర్, ఆత్రం మీరా జాలీంశా, మెస్రం స్పందన భూపతి, మార్కెట్ కమిటీ సభ్యుడు లింగు, మాజీ కోప్షన్ సభ్యుడు అప్రోజ్, కాంగ్రెస్ నాయకులు ఆత్రం శంకర్, మెస్రం అంబాజీ రావు, పెందుర్ ప్రకాష్, కనక గంగారాం, అజ్జులాల, హైమద్, షేక్ రహీం, హైదర్, షేక్ అబ్బు, సేద్మకి నాగో రావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply