ఆశా వర్కర్ల సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తాం

ఆశా వర్కర్ల సమస్యలు దశలవారీగా పరిష్కరిస్తాం
– మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలోని ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ఆశా వర్కర్లు గురువారం ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆశా వర్కర్ల న్యాయమైన సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారని తెలిపారు. దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
