మున్నూరు కాపు గ్రామ కమిటీ ఎన్నిక

మున్నూరు కాపు గ్రామ కమిటీ ఎన్నిక
నర్సింహులపేట, ఆంధ్రప్రభ: రామన్నగూడెం మున్నూరు కాపు గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నట్లు ఆ సంఘం మండల అధ్యక్షుడు కడుదుల రామకృష్ణ మంగళవారం తెలిపారు. మండలంలోని రామన్నగూడెం గ్రామ మున్నూరు కాపు అధ్యక్షుడిగా కుందుర్ల నాగరాజు, కార్యదర్శిగా గడ్డం జన్నయ్య, ఉపాధ్యక్షుడిగా సూరనేని మల్లయ్యలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. తన ఎంపిక కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ మున్నూరు కాపు సంఘం సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
