ఆలయా భూ కబ్జాని అడ్డుకున్న దేవాదాయశాఖ అధికారులు

చెన్నూర్ ఆంధ్రప్రభ :స్థానిక జగన్నాథ స్వామి దేవాలయ భూమి కబ్జా ను జిల్లా దేవాదాయశాఖ అధికారులు శనివారం అడ్డుకున్నారు. జిల్లా దేవాదాయశాఖ సూపర్డెంట్ ఆర్. రవికిషన్ తెలిపిన వివరాల ప్రకారం చెన్నూరు పట్టణ సమీప జాతీయ రహదారి సమీపపంలోని కోట్ల విలువగల సర్వే నెంబర్ (869/21) 3ఎకరాల 20గుంటల జగన్నాధస్వామి ఆలయానికి చెందిన భూమిని పట్టణానికి చెందిన నూకల సతీష్ అనే వ్యక్తి తో పాటు మరి కొంతమంది వ్యక్తులు ఆక్రమించుకొని చుట్టూ సిమెంట్ పిల్లర్లు వేసి మామిడి మొక్కలు నాటరనే సమాచారం మేరకు, దేవాదాయశాఖ జిల్లా ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు పోలీసు సిబ్బంది సహకారంతో దేవాదాయశాఖ సిబ్బంది జేసీబీ లతో సిమెంట్ పిల్లర్లను కూల్చి, మామిడి మొక్కలను తొలగించిన్నట్లు రవికిషన్ వెల్లడించారు.