క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సాయం
నేరేడుచర్ల, ఆంధ్రప్రభ : మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు రాపోలు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం క్యాన్సర్ బాధితుడికి ఆర్థిక సహాయం అందజేశారు.
నేరేడుచర్ల మున్సిపాలిటీకి చెందిన నిరుపేద క్యాన్సర్ బాధితుడు రమణతో కలిసి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం ఎన్ఆర్ఐ జయపాల్ రెడ్డి సహకారంతో రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని రమణకు అందజేశారు. బాధితుడికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పల్లెపంగ నాగరాజు, రామ్ సైదులు, షేక్ మన్సూర్ అలీ, కర్ణాకర్ గౌడ్, నళిని, గౌతమ్, అంబేద్కర్, రామ్, మధు తదితరులు పాల్గొన్నారు.
