Food Adulteration | ఆహార కల్తీ నిరోధంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

ఆహార కల్తీ అడ్డుకట్టపై MCRHRD లో అధికారులతో ముఖ్యమంత్రి కీలక భేటీ
హాజరైన సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, సలహాదారు రామకృష్ణారావు
ప్రజల ఆరోగ్యంపై రాజీ పడేది లేదని, కల్తీదారులపై కఠిన చర్యలకు ఆదేశం

Food Adulteration | ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో ఆహార కల్తీని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని MCRHRDలో జరిగిన ఈ సమావేశంలో ఆహార భద్రత, కల్తీ నియంత్రణ అంశాలపై చర్చించారు. ప్రజల ఆరోగ్యంతో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలు, వ్యక్తులపై నిరంతర తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఆహార నాణ్యత ప్రమాణాల అమలు, తనిఖీలను మరింత పటిష్టం చేయడం, ప్రజలకు సురక్షితమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.