సర్దార్ మరుపిళ్ల చిట్టికి ఘన నివాళులు..
భవానిపురం, ఆంధ్రప్రభ : స్వాతంత్ర సమరయోధుడు, మాజీ శాసనసభ్యుడు , స్వర్గీయ సర్దార్ మరుపిళ్ల చిట్టి 55 వ వర్ధంతి వేడుకలు చిట్టినగర్ లో శనివారం ఘనంగా జరిపారు.ఏపీ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని మరుపిళ్ళ చిట్టి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.

అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ పేద, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా, విజయవాడ అభివృద్ధికి మరియు కార్మిక సంఘాల ఏర్పాటుకు ఆయన చేసిన సేవలను కొనియాడారు..lఏపీ నగరాల యువజన సంఘం నేతలు. గూడేల శ్రీనివాసరావు , పిళ్ళ ఆనంద్ , బెవర మురళికృష్ణ, తమ్మిన హరిబాబు , జగ్గుపిళ్ళా భాను ప్రతాప్. పిళ్ళ ఆనంద్. మరుపిళ్ళా దేవిప్రసాద్, పోతిన రమేష్. రాళ్లపూడి మాధవ. తదితరులు పాల్గొన్నారు..
