సమస్యల పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యం..
భవానిపురం, ఆంధ్రప్రభ : ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) అన్నారు. ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆదేశాలతో కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ మాజీ కార్పొరేటర్లు, కూటమి నేతలతో కలిసి భవానీపురం ఎన్డీయే కార్యాలయంలో వినతులు స్వీకరించారు. ప్రజలు తమ వినతులను రేషన్ కార్డులు, పింఛన్లు, తాగునీరు, ఇళ్లస్థలాలు, వైద్య సహాయం వంటి తదితర సమస్యలపై దరఖాస్తు రూపంలో అందజేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఎం ఎల్ ఏ సుజన చౌదరి ఆధ్వర్యంలో నిరంతరం ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించి వినతులను స్వీకరిస్తున్నామని మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మహ్మద్ అబ్దుల్ ఖాదర్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కూటమి నేతలు ఈగల సాంబశివరావు, బాదర్ల శివ, బెవర శ్రీనివాసరావు, టీడీపీ మహిళా నాయకురాలు బంకా నాగమణి, సుజన మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు..
