ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా సంస్కృతి

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా సంస్కృతి

  • గద్దె క్రాంతి కుమార్

ఆంధ్రప్రభ, పటమట: పేదల కోసం పని చేయడం మా బాధ్యతని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా సంస్కృతిని కూటమి ప్రభుత్వం మాటల్లో కాదు, పనిలో చూపిస్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని కొండ ప్రాంత వాసుల చిరకాల స్వప్నాన్ని సాకారం చేస్తూ కూటమి ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని దశాబ్దాలుగా ఇళ్ల పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ఇప్పుడు న్యాయం జరుగుతోంది టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు.

బుధవారం 2, 3, 5, 6, 7 డివిజన్ పరిధిలోని కొండ ప్రాంతాలలో టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతికుమార్ విస్తృతంగా పర్యటించి ఇళ్ళ పట్టాల సర్వేను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్బంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఇళ్ల పట్టాల మంజూరుకు సంబంధించిన సర్వే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని తెలిపారు. పట్టాతో కూడిన సొంత స్థలం ప్రతి పేద కుటుంబానికి గౌరవం, భద్రత, భరోసా అనే లక్ష్యంతోనే 2018లో టీడీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాల మంజూరుకు పునాది వేసిందని తెలిపారు. అప్పుడు సర్వే పూర్తి అయి పట్టాలు ఇచ్చే సమయానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్, వెనువెంటనే సాధారణ ఎన్నికల కోడ్ రావడంతో ఆ ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడిందన్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల ఆశలను పూర్తిగా విస్మరించి, ఇళ్ల పట్టాల ప్రక్రియను నిలిపివేసి 5 సంవత్సరాల పాటు ఎటువంటి పురోగతి లేకుండా పేదలను నిరాశలో ముంచిందన్నారు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటూ ఆగిపోయిన ప్రక్రియను తిరిగి ప్రారంభించడంతో కొండ ప్రాంతాలు, ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న వేలాది కుటుంబాలకు ఇది గొప్ప అవకాశం దక్కిందన్నారు. సర్వే పూర్తయ్యాక ఇళ్ల పట్టాల మంజూరు ద్వారా వారికి చట్టబద్ధ హక్కులు లభించనున్నాయని, ఇళ్ల పట్టాలు అంటే కేవలం భూమి కాదని—అది ఒక కుటుంబానికి ఆత్మగౌరవం, ఆర్థిక భద్రత, బ్యాంక్ రుణాల అవకాశం, పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాదన్నారు. ఈ నిర్ణయం పేదల జీవితాలను మార్చే దిశగా విప్లవాత్మక అడుగని
సర్వే సమయంలో ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమాలలో రెవిన్యూ అధికారులు, 2, 3, 5, 6, 7 డివిజన్ల కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply