తాగునీటి అవసరాలకే.. నీటి విడుదల – ఏఈ. విజయ్ కుమార్

తాగునీటి అవసరాలకే.. నీటి విడుదల – ఏఈ. విజయ్ కుమార్


కోడూరు, ఆంధ్రప్రభ : కాలువల వెంట విడుదల చేసిన నీటిని గ్రామాల్లోని చెరువుల్లోకి మళ్లించుకోవాలని ఇరిగేషన్ శాఖ ఏఈ విజయకుమార్ ఆదివారం తెలిపారు. ప్రస్తుతం కోడూరు అవనిగడ్డ ప్రధాన పంటకాలువకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసినట్లు చెప్పారు.

ఈ నీటిని పంచాయతీల పరిధిలోని రక్షిత మంచినీటిని చెరువులు, ఊరచెరువుల్లోకి మళ్లించి ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చాలని సూచించారు. పది రోజుల పాటు కాలువల వెంట తాగునీరు వస్తుందని, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కేవలం తాగునీటి అవసరాల నిమిత్తమే విడుదల చేశారని, వ్యవసాయ అవసరాల నిమిత్తం కాదని ఏఈ స్పష్టం చేశారు.

Leave a Reply