CONSPIRACY | బీజేపీ తీరుపై మహేశ్‌కుమార్ గౌడ్ ఫైర్
CONSPIRACY | బీజేపీ తీరుపై మహేశ్‌కుమార్ గౌడ్ ఫైర్
CONSPIRACY |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ వ్యవహారంలో బీజేపీ వైఖరి అప్రజాస్వామికంగా ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వ తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు.
“మనది ప్రజాస్వామ్య దేశమా? లేక నియంతృత్వ దేశమా?” అని ప్రశ్నించిన మహేశ్‌కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్‌కు సంబంధించి ఎలాంటి ఎఫ్‌ఐఆర్ లేదా క్రిమినల్ కేసు లేదని అన్నారు. కేవలం ఒక నోటీసు మాత్రమే వచ్చిందని, దానిని ఆధారంగా చేసుకుని ఆమె నామినేషన్‌ను తిరస్కరించడం సరికాదని పేర్కొన్నారు.
మీనాక్షి నటరాజన్‌కు ఆ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రాజ్యసభలో తమ బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ ఈ కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు.
