songs| ఏడుగురు నేత్రవిద్యాలయం విద్యార్థులు ఎంపిక
songs| ఏడుగురు నేత్రవిద్యాలయం విద్యార్థులు ఎంపిక
ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో నేత్రవిద్యాలయం జూనియర్, డిగ్రీ కళాశాల శ్రీరామనగరం విద్యార్థులు “యూత్ ఫర్ జాబ్స్” వారు అంధుల కోసం నిర్వహించిన “గ్రాండ్ ఫినాలే” పాటల పోటీలో “విజేత”లుగా నిలిచి తమ ప్రతిభను చాటారు. సెమీఫైనల్స్ లో ఎంపికయిన 12 మందిలో ఏడుగురు నేత్రవిద్యాలయం విద్యార్థులు ఎంపిక అవటం విశేషం. ఏప్రిల్ 4వ తేదీన “ఆషియానా ఫంక్షన్ హాల్”లో నిర్వహించిన గ్రాండ్ ఫినాలే కి ప్రముఖ గాయిని హరిణిరావు, ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు బి.కార్తిక్ కొడకండ్ల, ప్రముఖ గాయకుడు డా. మహేశ్ జోషి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా జయేశ్ రంజన్, IAS మాధవిలత, MP, మీరా శెనాయి, యూత్ ఫర్ జాబ్స్ CEO పాల్గొని నేత్రవిద్యాలయం విద్యార్థులకు బహుమతులందించి ప్రశంసల వర్షం కురిపించారు.


