Australian Open-P.V Sindhu | మ‌ళ్లీ నిరాశే !!

Australian Open-P.V Sindhu | మ‌ళ్లీ నిరాశే !!

  • ఫైనల్‌కు అడుగు దూరంలో సింధుకు నిరాశ
  • వరల్డ్ ఛాంపియన్ ఎదుట పోరాడి ఓడిన పీవీ సింధు

ఆంధ్రప్రభ : భారత స్టార్ బ్యాడ్మింటన్ స్టార్ పీ.వి. సింధుకి మరోసారి నిరాశ ఎదురైంది (Australian Open-P.V Sindhu). ఆస్ట్రేలియన్ ఓపెన్-2026 టోర్నీలో ఫైనల్‌కు అడుగు దూరం వరకు చేరుకున్న సింధు.. సెమీఫైనల్‌లోనే తన ప్రయాణాన్ని ముగించుకుంది. శనివారం సిడ్నీలో జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ అకానే యమగుచి చేతిలో 22-20, 21-12 తేడాతో ఓటమి పాలైంది.

మొదటి గేమ్‌లో సింధు ఎక్కువ సమయం ఆధిక్యంలో కొనసాగినా, సింధు-య‌మ‌గుచి మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరకు డ్యూస్‌కు వెళ్లిన ఆ గేమ్‌ను… యమగుచి 22-20తో సొంతం చేసుకుంది. తొలి గేమ్ విజయం ఇచ్చిన ఊపుతో రెండో గేమ్‌లోనూ జపాన్ స్టార్ దూకుడు ప్రదర్శించింది. రెండో గేమ్ ఆరంభంలో సింధు ఆధిక్యంలో ఉన్నప్పటికీ, యమగుచి వరుస పాయింట్లు సాధిస్తూ 18-9 ఆధిక్యంలోకి వెళ్లింది. చివరకు సింధు నెట్‌లో షాట్ కొట్టడంతో మ్యాచ్ ముగిసింది.

2026లో రెండో సెమీఫైనల్…

సెమీస్‌కు ముందు క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన చెన్ సు-యుపై సింధు ఏకపక్ష విజయం సాధించింది. కేవలం 27 నిమిషాల్లోనే 21-6, 21-9తో ప్రత్యర్థిని చిత్తు చేసి చివరి నాలుగులోకి అడుగుపెట్టింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 10వ స్థానంలో ఉన్న సింధుకు ఈ ఏడాది బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో ఇది రెండో సెమీఫైనల్. జనవరిలో జరిగిన మలేషియా ఓపెన్‌లో కూడా సింధు చివరి నాలుగు దశకు చేరుకుంది.

టైటిల్ కల నెరవేరలేదు

2024లో లక్నోలో జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్‌లో మరో టైటిల్ కోసం సింధు ఎదురుచూస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ దిశగా సాగిన ఆమె ప్రయాణం సెమీస్‌లో ముగిసినా, 2026 సీజన్‌లో తిరిగి ఫామ్ అందుకుంటోందనే సంకేతాలను ఈ ప్రదర్శన ఇచ్చింది.

2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టైటిల్ గెలిచిన తర్వాత మరో బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సింధుకు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో టైటిల్ దిశగా ఆమె ప్రయాణం సెమీస్‌లోనే ముగిసినప్పటికీ, 2026 సీజన్‌లో సింధు తన ఫామ్‌లో పుంజుకునే సంకేతాలను చూపించింది.

Tejas Shirse breaks National Record | జాతీయ రికార్డు బద్దలు..