Kolikapudi | సర్పంచ్లతోనే సాధ్యం..

Kolikapudi | సర్పంచ్లతోనే సాధ్యం..
- సమిష్టి సహకారంతోనే ప్రగతి..
- ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
విస్సన్నపేట,ఆంధ్రప్రభ : సర్పంచులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. మండల అభివృద్ధి అధికారి చిన్న రత్నాలు ఆధ్వర్యంలో… తాత్కాలిక మండల అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాసరావు అధ్యక్షతన మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి మూడు నెలలకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మండలంలోని 22 ప్రభుత్వ శాఖల అధికారుల సమక్షంలో జరుగుతుందని ఆయన అన్నారు.
ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం ఆయా గ్రామ పంచాయతీల అభివృద్ధి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడంతో పాటు, గత సమావేశంలో ప్రస్తావించిన అంశాలు ఎంతవరకు పరిష్కారమయ్యాయో సమీక్షించి, మూడు నెలల తర్వాత జరిగే సర్వసభ్య సమావేశంలో వాటిపై మరింత చర్చించేందుకు ముసాయిదా సిద్ధం చేసుకోవడమేనని ఆయన వెల్లడించారు.
గ్రామాల అభివృద్ధి సర్పంచ్ లతోనే సాధ్యమని, సర్పంచ్ ప్రజల సమస్యలను పరిష్కరించి సంతృప్తిగా ఉంటే ప్రజలతో పాటు అధికారులు కూడా సంతోషంగా ఉంటారని ఆయన పేర్కొన్నారు. పార్టీలకతీతంగా, ఒక వారం రోజుల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో సమావేశాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ కె. కళ్యాణ్ లక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు గద్దల మల్లయ్య, మేడ తిరుపతిరావు, తాతకుంట్ల సర్పంచ్ ప్రొద్దుటూరు వెంకటేశ్వరరావు, పుట్రెల సర్పంచ్ స్వాతి, కొండపర్వత సర్పంచ్ జి. రమేష్‌బాబు, మండల వైస్ ఎంపీపీ గాజుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
