నూతన ఎస్‌ఐ సతీష్‌కు ఘన సన్మానం..
కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్‌పల్లి మండలానికి నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్‌ఐ సి.హెచ్. సతీష్ను శనివారం కమ్మర్‌పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ మరియు బీఆర్‌ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ సతీష్‌ను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తమ వంతు సహకారం అందిస్తామని సర్పంచ్, ఉపసర్పంచ్ పేర్కొన్నారు.
అనంతరం ఎస్‌ఐ సతీష్ మాట్లాడుతూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతిభద్రతలను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మైలారం సుధాకర్, వీడీసీ చైర్మన్ మల్యాల సుభాష్ గౌడ్, క్యాషియర్ పన్నాల రవీందర్, వార్డు సభ్యుడు లోలం సురేష్, బీఆర్‌ఎస్ నాయకులు కొంటి కంటి నరేందర్, బద్రి, రేంజర్ల మహేందర్, బద్దం రాజేష్, క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.
