Bheemgal | ప్రహరీ కూల్చివేత పై కోర్టుకు వెలుతాం

Bheemgal | ప్రహరీ కూల్చివేత పై కోర్టుకు వెలుతాం
Bheemgal | భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ప్రహరీ కూల్చి వేసే సమయంలో ఎలాంటి ముందస్తు నోటీసులుగాని సమాచారంగాని లేకుండా అధికారులు కూల్చి వేయడం జరిగిందని చొక్కం ఇజ్రాయెల్ ఆరోపించారు. ఈ రోజు టెన్త్ వార్డ్ లో అతను కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తాను, తన కుటుంబ సభ్యులు ఎవరు లేకుండా చూసి అనుమతి ద్వారా నిర్మించిన ప్రహరీని కూల్చి వేయడాన్ని ఆయన తప్పు బట్టారు. నోటీసులు లేకుండా ప్రహరి కూల్చి వేసిన ప్రతి ఒక్కరిపై కోర్ట్ లో కేసు నమోదు చేస్తానని పేర్కొన్నారు. తనకు జరిగిన నష్టాన్ని కోర్ట్ ద్వారా భర్తీ చేసుకుంటానని పేర్కొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన వారి ఒత్తిడితో అధికారులు ప్రహరీ కూల్చి వేయడం సమంజసం కాదన్నారు. ఏదైనా ఉంటే ముందస్తు నోటీసులు ఇచ్చేది ఉండే అన్నారు. కోర్ట్ లో కేసు ఉండగా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ సమావేశంలో కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
