supritha naidu| సెగ‌లు పుట్టిస్తున్న ఫొటోషూట్‌

supritha naidu| సెగ‌లు పుట్టిస్తున్న ఫొటోషూట్‌

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : గత కొంతకాలంగా గ్లామర్, ట్రెడిషనల్ లుక్స్‌తో నెటిజన్లను ఆకట్టుకుంటున్న సుప్రీత తాజాగా కొత్త ఫొటోషూట్‌తో అభిమానుల ముందుకు వచ్చింది. సమ్మర్ స్పెషల్ థీమ్‌తో షేర్ చేసిన ఈ చిత్రాల్లో ఆమె సింపుల్ స్టైలింగ్‌తో కనిపించినప్పటికీ, తనదైన హావభావాలతో ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది.

ఇటీవలే సంప్రదాయ లెహంగా దుస్తుల్లో కనిపించి ప్రశంసలు అందుకున్న సుప్రీత, ఈసారి మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో కెమెరాకు ఫోజులిచ్చింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సినీ కెరీర్ విషయానికి వస్తే, మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘లేచింది మహిళా లోకం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తూ సుప్రీత వెండితెరకు పరిచయమైంది. అలాగే మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్ అమర్‌దీప్ చౌదరితో కలిసి ‘చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి’ చిత్రంలోనూ నటిస్తోంది. ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ తనదైన శైలిలో ఆకట్టుకుంటూ సుప్రీత యువతలో మంచి క్రేజ్ సంపాదించుకుంటోంది.

One thought on “supritha naidu| సెగ‌లు పుట్టిస్తున్న ఫొటోషూట్‌

Comments are closed.