స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు కాకి రంగరాజ్‌కు అభినందనలు..
వికారాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన వికారాబాద్ ప్రాంతానికి చెందిన కాకి రంగరాజ్ను శనివారం వికారాబాద్‌కు చెందిన గిరీష్ కొటారి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గిరీష్ కొటారి మాట్లాడుతూ, క్షేత్రస్థాయి నుంచి ఎదిగి రాష్ట్ర స్థాయి బాధ్యతలను చేపట్టిన రంగరాజ్ మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రజాసేవలో ఆయనకు ఉన్న అనుభవం, అంకితభావం రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా కాకి రంగరాజ్ సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి ప్రజలకు మరింత సేవలందించాలని ఆయన ఆకాంక్షించారు.
