Kammarpally | గ్రామ సభలతో సమస్యలకు పరిష్కారం..
Kammarpally | గ్రామ సభలతో సమస్యలకు పరిష్కారం..
- సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి
కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని హసకొత్తూరు గ్రామ సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి అన్నారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక ముగింపు గ్రామసభలో ఆమె పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తోందని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్, ఇళ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న వడ్లకు బోనస్ వంటి పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని గ్రామ ప్రజలకు వివరించారు.
గ్రామాభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని కోరారు. గ్రామసభలో వివిధ శాఖల అధికారులు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి వారి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామసభ ప్రత్యేక అధికారి, తహసీల్దార్ నరేష్, ఎస్సై సీహెచ్ సతీష్, ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, పంచాయతీ కార్యదర్శి నరసయ్య, హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు అరుణశ్రీ, ఆరోగ్య శాఖ అధికారి పవన్ కుమార్, టీఏ మంజులరాణి, జీపీఓ శ్రీకాంత్, వార్డు సభ్యులు, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
