రైతుల చెంతకు సాంకేతిక పరిజ్ఞానం తీసుకెళ్లాలి
బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఉపకులపతి డా. పి వి సత్యనారాయణ పాల్గొన్నారు.
విచక్షణారహితంగా ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల నేల సారం తగ్గుతోందని, భావితరాలకు ఆరోగ్యవంతమైన నేలను అందించాలంటే జీవ ఎరువులు, సేంద్రియ పద్ధతులను ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ విద్యార్థులు రైతులకు సాంకేతిక పరిజ్ఞానం చేరవేసి సుస్థిర వ్యవసాయానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. అనంతరం విద్యార్థులు నేల పరిరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

