18 మంది మృతి
18 మంది మృతి
చేవెళ్ల నవంబర్ 3, ఆంధ్రప్రభ: చేవెళ్ల మండలంలో టిప్పర్ బీభత్సం..
మీర్జాగూడలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీ కొట్టడంతో 18 మంది మృతి చెందారు.
పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

గాయపడిన వారిని హుటాహుటిన చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
మితిమీరిన వేగంతో టిప్పర్ దూసుకు రావడం వల్లనే ఈ ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది.
టిప్పర్ బస్సును ఢీకొట్టిన వేగానికి టిప్పర్ లోని కంకర అంతా బస్సులోకి ఎగసి పడడంతో బస్సులోని ప్రయాణికులంతా కంకరలో కూరుకుపోయారు.ఈ ప్రమాదంతో బస్సు ముందరి భాగం పూర్తిగా ధ్వంసమైంది.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
రెస్య్కూ టీమ్జే సీబీలతో టిప్పర్ను లాగుతున్నారు
ఈ ఘటనతో చేవెళ్ల- వికారాబాద్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడి వాహనాలక్కడే నిలిచిపోయాయి.

