Minister | కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి..

Minister | కాంగ్రెస్‌ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి..

Minister | చెన్నూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌ పార్టీతోనే జరుగుతుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చెన్నూరు మండలం కొమ్మేర గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకులు(Leaders BRS) సత్యానంద్ గౌడ్ తన అనుచర వర్గంతో కలిసి మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy) సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

స్థానిక క్యాంప్ కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు.

Leave a Reply