పుట్టపర్తిలో వెనిజులా ఉపాధ్యక్షురాలికి ఘన స్వాగతం
పుట్టపర్తిలో వెనిజులా ఉపాధ్యక్షురాలికి ఘన స్వాగతం
పుట్టపర్తి, ఆంధ్రప్రభ: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకునేందుకు పుట్టపర్తికి విచ్చేసిన Delcy Rodríguezకు శనివారం పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. Palle Sindhura Reddy పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి ఆత్మీయంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, శ్రీ సత్యసాయి బాబా చిత్రపటంతో పాటు ప్రసిద్ధ ధర్మవరం పట్టుచీరను డెల్సీ రోడ్రిగ్జ్కు బహూకరించారు. ధర్మవరం పట్టుచీర నాణ్యత, కళాత్మకత తనను ఎంతో ఆకట్టుకున్నాయని పేర్కొంటూ డెల్సీ రోడ్రిగ్జ్ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో Shyam Prasad, Satish Babu, Palle Raghunatha Reddy, Sri Sathya Sai Central Trust మేనేజింగ్ ట్రస్టీ R. J. Rathnakar, ట్రస్ట్ సభ్యులు, జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, ఆర్డీవో సువర్ణ, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.
విమానాశ్రయం నుంచి అనంతరం డెల్సీ రోడ్రిగ్జ్ Prasanthi Nilayamకు చేరుకుని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు.
