పాస్ పోర్ట్ ను సరెండర్ చేసిన మాజీ మంత్రి…
పాస్ పోర్ట్ ను సరెండర్ చేసిన మాజీ మంత్రి…
హై కోర్టు ఆదేశాల మేరకు డీఎస్పీ ఎం హనుమంతరావుకు పాస్ పోర్ట్ ను అప్పగించిన రజని
నరసరావుపేట, ఆంధ్రప్రభ : హైకోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి విడదల రజిని తన పాస్ పోర్ట్ ను ఆదివారం డిఎస్పీ ఎం హనుమంతరావుకు అప్పగించారు. చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన ఒక టీడీపీ నాయకుడు మాజీ మంత్రి విడదల రజని పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మాజీ మంత్రి రజిని దేశం విడిచి వెళ్లకూడదని, పాస్ పోర్ట్ ను డిఎస్పీ కార్యాలయంలో అప్పచెప్పాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు రజని తన పాస్ పోర్ట్ ను నరసరావుపేట డిఎస్పి కార్యాలయంలో సరెండర్ చేశారు. మాజీ మంత్రి రజని వెంట వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
