నూతన కమిషనర్‌తో టీడీపీ నేతల భేటీ..

నూతన కమిషనర్‌తో టీడీపీ నేతల భేటీ..

అభివృద్ధిపై కీలక చర్చ!

బాపట్ల, ఆంధ్రప్రభ : బాపట్ల మున్సిపాలిటీ నూతన కమిషనర్‌ను సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో కమిషనర్ విజయవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.

పట్టణాభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై కమిషనర్‌తో నాయకులు చర్చించినట్లు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా మున్సిపల్ పరిపాలన కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి ఆంధ్రయ్య, కర్పూరపు రామారావు, కర్పూరపు కౌండిన్య, పారిశ రమేష్ గౌడ్, చాప సోమయ్య, పట్టణ ఉపాధ్యక్షుడు శేషు కృష్ణ, యలవల శ్రీనివాసరావు, చేజర్ల సతీష్, సలగల రాజా, ఐనంపూడి షాలెం రాజు, యక్కలదేవి నాగరాజు, శీలం శ్రీనివాస్ కుమార్, భీమా కోటేశ్వరావు, అజీరయ్యతో పాటు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.