Guntur | 3.39 కోట్లతో ఫైర్ స్టేషన్

Guntur | 3.39 కోట్లతో ఫైర్ స్టేషన్
- భవన నిర్మాణానికి శంకుస్థాపన
- హాజరైన కలెక్టర్ తమీమ్ అన్సారియా
Guntur | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ : జిల్లాలో అగ్నిమాపక సేవలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంమని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అన్నారు. ఈ రోజు జిల్లా అగ్ని మాపక భవనం నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌లో రూ.3.39 కోట్ల వ్యయంతో ఈ ఆధునిక భవనాన్ని నిర్మించనున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అగ్నిమాపక విభాగం ప్రజల భద్రతలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు అవసరమైన సౌకర్యాలు, ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మించాలని అధికారులకు సూచించారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయాలని ఆకాంక్షించారు. కొత్త అగ్ని మాపక భవనం ద్వారా సిబ్బందికి మెరుగైన కార్యాలయ వసతులు, శిక్షణకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, తద్వారా జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక సేవలు మరింత సమర్థవంతంగా అందించగలమని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్‌ఎస్‌కె.ఖాజా వలి, రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస రావు, ప్రాంతీయ అగ్నిమాపక అధికారి ఎంఎక్యూ జిలానీ, జిల్లా అగ్నిమాపక అధికారి ముక్కు శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు.
