ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా
ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా
జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి
కర్నూలు ప్రతినిధి : ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి తెలిపారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో A.P.N.G.O, ఉపాధ్యాయ సంఘాలు, రెవెన్యూ సర్వీసెస్, నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం, డ్రైవర్ల సంఘం మరియు రిటైర్డ్ ఉద్యోగుల/పెన్షనర్ల సంఘాలతో సహా మొత్తం 14 గుర్తింపు పొందిన సంఘాల అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులతో కలెక్టర్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం, కార్యనిర్వహణలో మెరుగుదల మరియు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా ఉద్యోగ సంఘాలతో సమన్వయంతో పనిచేస్తామని కలెక్టర్ తెలిపారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత శాఖలతో చర్చించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా పరిపాలన మరియు ఉద్యోగ సంఘాల మధ్య పరస్పర సహకారం, సమన్వయం కొనసాగాలని కలెక్టర్ ఆకాంక్షించారు..
A.P.N.G.O సంఘం, ఉపాధ్యాయ సంఘాలు తదితరులు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, కార్యాలయ నిర్వహణకు సంబంధించిన విషయాలపై చర్చించి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు, అభ్యర్థనలు మరియు సూచనలను కలెక్టర్ దృష్టికి తీసుకోని వచ్చారు వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు..
సమావేశంలో డిఆర్ఓ సి.వెంకట నారాయణమ్మ, తదితరులు పాల్గొన్నారు.

