ఇండోనేషియా ఓపెన్ టోర్నమెంట్‌లో భారత పోరు నిరాశతో ముగిసింది. భారత్ స్టార్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ – చిరాగ్ క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. మలేషియాకు చెందిన మాన్ వీ చాంగ్ – టీ కై వున్ జోడీ చేతిలో 19-21, 16-21 తేడాతో పరాజయం పాలయ్యారు. ఈ విజయంతో మలేషియా జోడీ సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టగా.. సాత్విక్-చిరాగ్ ఓటమితో భారత్ ఆశలు అంతమయ్యాయి.
భారత ఆటగాళ్లు ఇప్పటికే సింగిల్స్, డబుల్స్ విభాగాల నుంచి ఎలిమినేట్ అవ్వగా… సాత్విక్ – చిరాగ్ ఓటమితో టోర్నమెంట్ లో భారత్ పోరు ముగిసింది.