మట్టి టిప్పర్ బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
మట్టి టిప్పర్ బోల్తా.. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు
వలిగొండ, ఆంధ్రప్రభ:
మండలంలోని చిత్తాపురం స్టేజి వద్ద కొడమర్ల బావి సమీపంలో బుధవారం సాయంత్రం మట్టి లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మోత్కూరు నుంచి మట్టి లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ చిత్తాపురం స్టేజి వద్దకు చేరుకోగానే అదుపు తప్పి రోడ్డుపై బోల్తా పడింది.
స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన డ్రైవర్‌ను స్థానిక వైద్య కేంద్రానికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
