ట్రాక్టర్ టైర్ల కిందపడి బాలుడు మృతి..
మరిపెడ, ఆంధ్రప్రభ : సైకిల్ పై ఇంటికి వెళుతున్న బాలుడు ట్రాక్టర్ ఢీకొని టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు.ఈసంఘటన తాళ్ల ఊకల్ గ్రామంలో చోటు చేసుకుంది. మరిపెడ మండలంలోని తాళ్ల ఊకల్ గ్రామంలో జరిగింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బోయిని లింగన్న, ధనమ్మ వీరి కుమారుడు బోయిన ప్రణీత్ (9) స్థానిక పాఠశాలలో 4వ తరగతి పూర్తి చేశాడు. రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పాఠశాలకు వెళ్లి మధ్యాహ్న వరకు స్కూల్లోనే ఉన్న బాలుడు అనంతరం తన తల్లి చేను వద్ద ఉండటంతో తల్లి దగ్గరకు వెళ్లి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చాడు. ఇంటికి వెళుతున్నానని చెప్పి వస్తున్న క్రమంలో మట్టి ట్రాక్టర్ వేగంగా అతడిని సైకిల్ని ఢీకొట్టడంతో ట్రాక్టర్ వెనుక టైర్ల కింద పడి ప్రణీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. హుటా హుటీనా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై గండ్రాతి సతీష్, అదనపు ఎస్ఐ మహబూబి, సందర్శించి విచారణ చేపట్టారు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మహబూబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
