బాధితుడికి ఎల్‌ఓసీ అందజేసిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
చిలుపూర్, ఆంధ్రప్రభ : జఫర్ గడ్ మండలం ఉప్పుగల్ గ్రామానికి చెందిన అప్పరబోయిన సాత్విక్ అనారోగ్యానికి గురి కావడంతో, ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 1లక్ష ఎల్‌ఓసీ చెక్కును హన్మకొండ కనకదుర్గ కాలనీలోని నివాసంలో మంగళవారం బాధిత కుటుంబ సభ్యులకు మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా అవసరమైన వారికి వైద్య సహాయం అందిస్తూ ప్రజల ప్రాణాలను కాపాడే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడితే తమ దృష్టికి తీసుకురావాలని, తగిన సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కృతజ్ఞతలు తెలిపారు.
