పశువులను గాలికుంటు వ్యాధి నుండి సంరక్షించుకోవాలి !

పశువులను గాలికుంటు వ్యాధి నుండి సంరక్షించుకోవాలి !

సోమనపల్లి గ్రామ సర్పంచి : రమ ఉమా దేవేందర్ ,

టేకుమట్ల, ఆంధ్రప్రభ : వ్యాధుల నుండి పశువులను సంరక్షించుకోవాలని సోమనపల్లి గ్రామ సర్పంచి రామ ఉమా దేవేందర్ అన్నారు టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో టేకుమట్ల మండల పశు ఆరోగ్య ఉప కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి రమ ఉమా దేవేందర్ పాల్గొని గ్రామ ప్రజలందరూ తప్పకుండా మూడు నెలల దాటిన పశువులన్నిటికీ గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయించుకోవాలని కోరారు ఈ గాలికుంటు నివారణ టీకాలు వేయించుకున్నట్లయితే రాబోయే వర్షాకాలంలో పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా నివారించుకోవచ్చునని తెలిపారు పశువులను ప్రతిరోజు క్లుప్తంగా పరిశీలించి వ్యాధుల బారిన పడిన పశువులను తక్షణమే గుర్తించి సంబంధిత పశువైద్యులచే చికిత్స చేయించుకోవాలని అన్నారు.

గ్రామంలో ఉన్న 65 తెల్ల పశువులకు 38 నల్ల పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వెంకట్రావుపల్లి ప్రాథమిక పశువైద్య కేంద్రం పశువైద్య సహాయ శాస్త్ర చికిత్సకులు మోటం వివేక్ కుమార్ టేకుమట్ల మండల పశు ఆరోగ్య ఉప కేంద్రం పశు సంపద సహాయకులు దాసరి శంకర్, గోపాలమిత్రలు కుమార్, రాజేందర్, పశు మిత్ర వనిత పాడి రైతులు చిక్కుల చుక్కయ్య చిక్కుల సదయ్య బుచ్చయ్య రాజేందర్ రాయమల్లు చిన్న రాజయ్య రఘునయ్య పశుపోషకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply