Kidnapping | చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు..
Kidnapping | చిన్నారుల కిడ్నాప్ ముఠా గుట్టురట్టు..
Kidnapping | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో చిన్నారుల కిడ్నాప్(Kidnapping) ముఠా గుట్టురట్టయ్యింది. ముఠా సభ్యులు నరేష్, యాదగిరి లను అరెస్ట్ చేశారు. ఈ ముఠా రెండేళ్లలో ఆరుగురు పిల్లలను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. చిన్నారులను కిడ్నాప్ చేసే ఈ ముఠా పిల్లలు లేని వారికి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆరుగురు చిన్నారులను పోలీసులు(police) రక్షించారు. ముఠా నుంచి ఓ కారు, 12 సెల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు. చిన్నారులను కొన్న 8మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
