కొత్త బాధ్యతలతో నాయకుడికి ఘన సన్మానం..
మోత్కూర్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన ఏనుగు జితేందర్ రెడ్డిని శనివారం బీజేపీ నాయకులు శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు జితేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పార్టీ బలోపేతానికి ఆయన సేవలు మరింత ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గౌరు శ్రీనివాస్, పోచం సోమయ్య, మండల అధ్యక్షుడు గుదే మధుసూదన్ యాదవ్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు భీమిడి తిరుమల రెడ్డి, పనకబండ ఉపసర్పంచ్ రాధారపు మల్లేష్, మండల ఉపాధ్యక్షుడు గుంటి సతీష్ తదితరులు పాల్గొన్నారు.
