Tragic Incident | నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు మృతి

Tragic Incident | నిర్మాణంలో ఉన్న వంతెన కూలి ఆరుగురు మృతి

Tragic Incident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్‌పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బెట్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వంతెన నిర్మాణ పనులు కొనసాగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. వంతెన భాగం కూలిపోవడంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరికొందరు గాయపడినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, రెస్క్యూ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. వంతెన నిర్మాణ నాణ్యత, భద్రతా ప్రమాణాల అమలుపై కూడా దర్యాప్తు జరపనున్నట్లు వెల్లడించారు.