మృతుల కుటుంబాలను పరామర్శించిన జనసేన నాయకులు

అవనిగడ్డ, ఆంధ్రప్రభ ; కోడూరు మండలం విశ్వనాధపల్లి శివారు కుమ్మరిపాలెంలో తాడిచెట్టు పడి మృతి చెందిన ఇద్దరు యువకుల భౌతిక కాయాలను జనసేన పార్టీ నాయకులు సందర్శించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్, సీనియర్ నాయకులు బచ్చు వెంకట్ నాధ్ ప్రసాద్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజనాల వీరబాబు, ఆసుపత్రి డైరెక్టర్ బచ్చు కృష్ణకుమారి శుక్రవారం ఉదయం అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు.

మనోహర్, శివరామకృష్ణ భౌతిక కాయాలను సందర్శించి వారి మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపం, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ సహాయం అందించేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని వారికి భరోసా కల్పించారు. యుక్త వయసులో ఉన్న కుమారులను పోగొట్టుకున్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈదురు గాలులకు తాడి చెట్టు విరిగిపడి మనోహర్, శివరామకృష్ణ మృతి చెందటం విచారకరం అన్నారు. నాయకులు సిద్దినేని అశోక్ నాయుడు, కూరాకుల శివప్రసాద్, గుడివాక రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply