Rs.234cr | నెల్లూరుకు రూ.234 కోట్లతో విద్యా సంస్థ

Rs.234cr | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టును ప్రకటించింది. నెల్లూరు జిల్లాలో రూ.234 కోట్ల అంచనా వ్యయంతో 50 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఆర్‌ఐఈ)ను నిర్మించనుంది.

ఈ విద్యాసంస్థను ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయనున్నారు. ఆధునిక విద్యా మౌలిక సదుపాయాలు, పరిశోధన కేంద్రాలు, శిక్షణా వసతులతో ఈ సంస్థను తీర్చిదిద్దనున్నట్లు సమాచారం.

ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే రాష్ట్రంలోని విద్యార్థులు, ఉపాధ్యాయ శిక్షణ పొందే అభ్యర్థులకు నాణ్యమైన విద్యా అవకాశాలు విస్తరించడంతో పాటు, విద్యారంగ అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని అధికారులు భావిస్తున్నారు.