అమెరికాలో విషాదం..

నల్గొండ, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన నవ్య (24) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందింది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన నవ్య, చికాగోలో స్నేహితులతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా వారి కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవ్య అక్కడికక్కడే మృతి చెందగా, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Leave a Reply