టీజీ పాలిసెటులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్…

టీజీ పాలిసెటులో స్టేట్ ఫస్ట్ ర్యాంక్…

పొనకల్ విద్యార్థిని అల్వియా షిఫాలీ..
స్లేట్ హైస్కూల్ ఘనత..

జన్నారం, ఆంధ్రప్రభ : టీజీ పాలిసెట్- 2026 ఫలితాల్లో మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ విద్యార్థిని ఎం.డి అల్వియా షిఫాలి 120 మార్కులకు గాను 120 మార్కులు పొంది, రాష్ట్రంలో ఫస్ట్ ర్యాంకు,ఎంబైపీసీలో రాష్ట్రస్థాయిలో 117 మార్కులతో 25వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచింది.ఆ విద్యార్థిని జన్నారం మండల కేంద్రంలోని స్లేట్ హైస్కూల్ లో శిశు నుంచి పదో తరగతి వరకు చదివింది.ఆ విద్యార్థిని టెన్త్ లో 600 మార్కులకు గాను 583 మార్కులు పొంది, మండల టాపరుగా నిలిచింది.

మండలంలోని పొనకల్ కు చెందిన ఎం.డి హైమద్,అహిషాబేగం దంపతుల కుమార్తె అల్వియా షిఫాలి చిన్నప్పటి నుంచి చదువులో ఎంతో చురుగ్గా చదువుతుంది. శనివారం ప్రకటించిన టీజీ పాలీసెట్ ఫలితాల్లో రాష్ట్ర ప్రథమ ర్యాంకు సాధించి ఆ విద్యార్థిని స్థానిక స్లేట్ హైస్కూల్ చైర్మన్ ఏనుగు శ్రీకాంత్ రెడ్డి,వ్యవస్థాపకుడు ఏనుగు సుభాష్ రెడ్డి,డైరెక్టర్ ఏనుగు రజితరెడ్డి, ప్రిన్సిపాల్ శిరీన్ ఖాన్,ఉపాధ్యాయుడు కృష్ణ, ఉపాధ్యాయ బృందం అభినందించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. విద్యార్థిని అల్వియా షిఫాలి టెన్త్లో మండల టాపరుగా,టీజీ పాలీసెట్ లో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించడం తమకు ఎంతో గర్వకారణమన్నారు.

ఆ విద్యార్థిని ఎంబైపీసీలో రాష్ట్ర 25వ ర్యాంకు సాధించి అద్భుత ప్రతిభ కనబరిచిందని ఆయన కొనియాడారు.ఈ సందర్భంగా ఆ విద్యార్థిని మాట్లాడుతూ.. చదువులో టీచర్లు తనను ఎంతో తీర్చిదిదారన్నారు.ఉపాధ్యాయ బృందం కృషి,తల్లిదండ్రుల ప్రోత్సహంతో ర్యాంకు సాధించానని ఆమె చెప్పారు.ఐఏఎస్ కావడమే లక్ష్యంగా చదువుకుంటానని ఆమె స్పష్టం చేశారు.