రేపు గోధారమ్మకు కార్తీక హారతి

రేపు గోధారమ్మకు కార్తీక హారతి
బాసర, నవంబర్ 4 (ఆంధ్ర ప్రభ) : దక్షిణ భారతదేశంలోని తెలంగాణలో నిర్మల్ జిల్లా బాసర వద్ద గోదావరి నదికి బుధవారం కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని గోదారమ్మకు విశేష కార్తీక హారతి నిర్వహిస్తున్నట్లు ఈవో అంజనీదేవి (EO Anjani Devi) తెలిపారు. బాసర చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి అమ్మవారి నిలయంలోని గోదారమ్మకు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని తెల్లవారుజామున గోదావరి నది తీరంలోని సూర్యేశ్వర ఆలయంలో విశేష అభిషేకం భస్మహారతి, బిల్వార్చన నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ అంజనిదేవి తెలిపారు. సాయంత్రం గోదావరి నదికి సౌభాగ్య ద్రవ్య సమర్పణ దీపోత్సవం నిర్వహించి గంగా హారతి నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈఓ కోరారు.
