నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నాకబంది, లాడ్జిల తనిఖీలు..

నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నియమాల అమలు,ప్రజలకు సురక్షిత వాతావరణం కల్పించే లక్ష్యంతో జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ ఆదేశాల మేరకు నిన్న రాత్రి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీలలో భాగంగా జిల్లాలోని లాడ్జీలు, దాబాలు, ప్రధాన కూడళ్లు, రహదారులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసర ప్రాంతాలు మరియు ఇతర కీలక ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, నేర చరిత్ర కలిగిన వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచి పరిశీలించారు.

లాడ్జీలు,దాబాల నిర్వాహకులకు తమ వద్దకు వచ్చే వ్యక్తుల పూర్తి వివరాలు నమోదు చేయాలని, సీసీ కెమెరాలు తప్పనిసరిగా పనిచేసేలా చూడాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపించిన వెంటనే సమీప పోలీస్ కల్పించరాదని హెచ్చరించారు.

అదేవిధంగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో నాకాబంది నిర్వహించి వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, వాహన రిజిస్ట్రేషన్ వివరాలు తనిఖీ చేశారు. నెంబర్ ప్లేట్లు లేకుండా నడిపే వాహనాలు, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలపై ప్రత్యేక దృష్టి సారించారు.

ప్రజల భద్రతకు విఘాతం కలిగించే నేరగాళ్లు, సంఘ వ్యతిరేక శక్తులు, అనుమానాస్పద కదలికలను అరికట్టేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు నాకాబందీలు నిరంతరంగా కొనసాగుతాయని,శాంతియుత సమాజ నిర్మాణంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించిన వెంటనే డయల్ 100 కు లేదా పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల, ఐపీఎస్ సూచించారు. ఈ విస్తృత తనిఖీల్లో నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, భైంసా ఏఎస్పీ సాయి కిరణ్,ఐపీఎస్, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply