18 major cities | గువహాటి, శ్రీనగర్, పాట్నా, వారణాసి..
18 major cities | గువహాటి, శ్రీనగర్, పాట్నా, వారణాసి..
18 major cities | అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌లో సేవలు
కేవలం రూ.40 కే వేగవంతమైన ఏసీ ప్రయాణం
18 major cities | న్యూ ఢిల్లీ, ఆంధ్రప్రభ : భారతదేశ రవాణా రంగంలో సరికొత్త విప్లవానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నగరాల్లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించడానికి, పర్యావరణహితమైన ప్రయాణాన్ని అందించడానికి ‘వాటర్ మెట్రో ప్రాజెక్టును వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కేరళలో సక్సెస్ ఫుల్ గా నడుస్తున్న ఈ వాటర్ మెట్రో సేవలను దేశంలోని 18 ప్రముఖ నగరాల్లో ఈ సేవలను ప్రారంభించేందుకు కేంద్రం కసరత్తు ముమ్మరం చేసింది. తొలి దశలో భాగంగా గువహాటి, శ్రీనగర్, పాట్నా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ వంటి నగరాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు.
వాటర్ మెట్రో అంటే …
నదులు, సరస్సులు లేదా బ్యాక్ వాటర్స్ ఉన్న నగరాల్లో నీటి మార్గం ద్వారా సాగే ఒక ఆధునిక రవాణా వ్యవస్థే ఈ వాటర్ మెట్రో. ఇది చూడటానికి సాధారణ మెట్రో రైలు లాగే అత్యాధునికంగా, ఎయిర్ కండిషన్డ్ సౌకర్యంతో ఉంటుంది, కానీ ఇది పట్టాలపై కాకుండా నీటిపై నడుస్తుంది. ఈ ప్రాజెక్టులో పర్యావరణానికి హాని చేయని ఎలక్ట్రికల్ లేదా హైబ్రిడ్ బోట్లను ఉపయోగిస్తారు. సాధారణ మెట్రో రైలు మార్గాలతో పోలిస్తే దీని నిర్మాణ ఖర్చు చాలా తక్కువ , వేగంగా పూర్తి చేయవచ్చు. దేశంలోనే మొట్టమొదటి వాటర్ మెట్రో సేవలు కేరళలోని కొచ్చిలో 2023లో ప్రారంభమై అత్యంత విజయవంతంగా నడుస్తున్నాయి.
సామాన్యుడి బడ్జెట్ లోనే టికెట్ ధరలు
ఈ వాటర్ మెట్రో ప్రాజెక్టులో టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. కొచ్చి వాటర్ మెట్రో ధరల ఆధారంగా చూస్తే, రాబోయే నగరాల్లో కూడా కనీస, గరిష్ట సింగిల్ టికెట్ ధర రూ.40 లోపే ఉండే అవకాశం ఉంది. నిత్యం ప్రయాణించే వారి కోసం వారపు పాస్ ధర రూ.180 గానూ, నెలవారీ పాస్ ధర రూ. 600 గానూ నిర్ణయించే అవకాశం ఉంది. ఈ బోట్లలో ఉచిత వై-ఫై, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, సీసీటీవీ కెమెరాలు, లైఫ్ జాకెట్లు వంటి అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పిస్తున్నారు.
CLICK HERE TO READ April1,2024 | ఖాతా వివరాల నుంచి విత్ డ్రా వరకు వాట్సాప్‌లోనే..
