తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇకలేరు

తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఇకలేరు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌: తమిళ సినీ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన 84 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. గ్రామీణ నేపథ్య కథలకు సహజత్వాన్ని జోడించి తమిళ సినిమాకు కొత్త దిశ చూపిన దర్శకుడిగా భారతీరాజా ప్రత్యేక గుర్తింపు పొందారు.

1941 జులై 17న జన్మించిన భారతీరాజా, దశాబ్దాల పాటు దక్షిణాది సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు. ‘పదహారేళ్ల వయసు’, ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ చేరువయ్యారు. ఆయన తెరకెక్కించిన పలు చిత్రాలు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాయి. భారతీరాజా మరణంతో తమిళ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి.