బాలుడిపై వీధి కుక్కల దాడి

బాలుడిపై వీధి కుక్కల దాడి

కాజీపేట, ఆంధ్రప్రభ:
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 48వ డివిజన్ పరిధిలోని దర్గా కాజీపేటలో వీధి కుక్కలు ఓ బాలుడి దాడి చేసి విచక్షణా రహితంగా కరచిన సంఘటన బుధవారం వెలుగుతుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్గా ఖాజీపేట నేతాజీ నగర్ కు చెందిన అబ్దుల్ సత్తార్ కూరగాయల వ్యాపారం చేసుకుంటూ భార్య ముగ్గురు పిల్లలను కుటుంబాన్ని పోషించు కుంటున్నాడు. అబ్దుల్ సత్తార్ కుమారుడు మహమ్మద్ అబ్దుల్ సాహిర్ (5), ఎప్పటి లాగే నిద్రలేచి ఉదయం ఇంటి ముందు ఆరు బయటకు వచ్చాడు. అంతలోనే వీధి కుక్కల గుంపు అటువైపుగా పరిగెత్తుకుంటూ వచ్చి సాహీర్ పై విచక్షణారహితంగా దాడి చేసింది. కొంతమంది స్థానికులు ఆ కుక్కలను కర్రలతో బెదిరించి సాహిర్ ను కాపాడారు. కుక్కల దాడిలో గాయపడిన సాహిర్ ను ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply