POCSO case | కీలక ఆధారాలు మాయం చేశాడని….

POCSO case | కీలక ఆధారాలు మాయం చేశాడని….

POCSO case | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌కు మరో భారీ షాక్ తగిలింది. కేసు దర్యాప్తులో కీలక ఆధారాలను మాయం చేశాడన్న ఆరోపణలతో పోలీసులు తాజాగా మరో సెక్షన్‌ను జోడించారు. దీంతో ఈ కేసు మరింత కీలక మలుపు తిరిగింది.

పోలీసుల వివరాల ప్రకారం.. లొంగిపోయిన తర్వాత విచారణ సందర్భంగా భగీరథ్ పోలీసులకు ఖాళీ మొబైల్ ఫోన్ మాత్రమే ఇచ్చినట్లు తెలిపారు. ఫోన్‌కు సంబంధించిన సిమ్ కార్డు ఎక్కడో పెట్టి మర్చిపోయానని చెప్పినట్లు పోలీసులు పేర్కొన్నారు. కీలక డిజిటల్ ఆధారాలను ఉద్దేశపూర్వకంగా తొలగించాడనే అనుమానాలతో పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 238ను జోడించారు.

ఇటీవల బాధిత మైనర్‌పై పదేపదే లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో భగీరథ్‌పై ఇప్పటికే BNS 64(2)(m) సెక్షన్‌తో పాటు పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. తాజా సెక్షన్ చేరికతో కేసు తీవ్రత మరింత పెరిగిందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.