మృతుల కుటుంబాలకు కీర్తి రెడ్డి పరామర్శ

మృతుల కుటుంబాలకు కీర్తి రెడ్డి పరామర్శ

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలోని కాల్వపల్లి కి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు బిస్కుల రవి, అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో సోమవారం వారి కుటుంబాన్నిబీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏడు నూతల నిషిధ రెడ్డిలు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మండలంలోని గాంధీనగర్ కి చెందిన బీజేపీ దళిత మోర్చా జిల్లా నాయకుడు రత్న రమేష్, తల్లి రత్న సమ్మమ్మ, అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండలధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా ఐటీ సెల్ కన్వీనర్ పంచిక మహేష్ యాదవ్ ,మండల ప్రధాన కార్యదర్శి రావుల రాకేష్ , మండల ఉపాధ్యక్షులు నల్ల శ్రీనివాస్ రెడ్డి, చింతల రాజేందర్, సంఘ రఘుపతి తదితరులు పాల్గొన్నారు.