16వ కోడూరు మండల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

16వ కోడూరు మండల స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం

పోటీలను ప్రారంభించిన టిడిపి మండల అధ్యక్షులు బండే శ్రీనివాసరావు

కోడూరు, ఆంధ్ర‌ప్ర‌భ : మండల పరిధిలోని స్వతంత్ర పురం జిల్లా పరిషత్ హై స్కూల్ క్రీడా మైదానంలో స్వతంత్రపురం సౌజన్యంతో 16వ కార్క్ బాల్ మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్.ను కోడూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ జెడ్పిటిసి బండే శ్రీనివాసరావు ప్రారంభించారు. గత 16 సంవత్సరాలుగా కోడూరులోని స్వతంత్రపురంలో గల క్రీడా మైదానంలో క్రికెట్ పోటీలను నిర్వహించడం అభినందనీయమని బండే శ్రీనివాసరావు అన్నారు.

కొద్దిసేపు క్రీడాకారులతో క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి తిమ్మన వెంకట నాంచారయ్య, బ్యాంక్ డైరెక్టర్ పూత బోయన శ్రీనివాసరావు, వెంకన్న, కాగిత శివప్రసాద్,శివ, తో పాటు టోర్నమెంట్ నిర్వాహకులు పాల్గొన్నారు