బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా శ్రీనివాస్

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్‌గా ప్రముఖ సామాజిక వేత్త, భారత్ సేవా సహకార ఫోరం వ్యవస్థాపకులు బసవరాజు శ్రీనివాస్ గురువారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖల సమక్షంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

సేవకు దక్కిన గౌరవం : 1996 నుంచి ప్రజా సేవలో కొనసాగుతున్న శ్రీనివాస్
చౌటుప్పల్ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా సమయంలో ఆయన అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం “మాస్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా” బిరుదుతో సత్కరించింది. ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. ముఖ్యంగా బాలికల గురుకుల పాఠశాలకు జనరేటర్, కంప్యూటర్లు అందించి విద్యార్థినుల కష్టాలను తీర్చారు.

​సీఎంకు కృతజ్ఞతలు
నిజమైన సేవాతత్పరత కలిగిన వ్యక్తిని గుర్తించి కీలక పదవిని అప్పగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి చౌటుప్పల్ శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బొబ్బిళ్ళ మురళి కృతజ్ఞతలు తెలిపారు.