కెరీర్ గైడెన్స్‌పై సర్కారు ప్రత్యేక ఫోకస్

కెరీర్ గైడెన్స్‌పై సర్కారు ప్రత్యేక ఫోకస్

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తూ, ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభం కానుంది. జూన్ 19 వరకు సుమారు 37 రోజుల పాటు సాగే ఈ బృహత్తర అడ్మిషన్ల డ్రైవ్ ద్వారా ప్రభుత్వ విద్యారంగంలో నూతన అధ్యాయా నికి శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ బడులంటే కేవలం ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం మాత్రమే కాదని.. అంతకు మించి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని తెలియజే యనుంది.

ముఖ్యంగా తెలుగు, ఇంగ్లీష్, గణితం సబ్జెక్టుల లో విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచేందుకు అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత లెర్నింగ్ ప్లాట్ఫారమ్ను ప్రవేశపెట్టారు. ప్రతి స్కూల్లో హై-స్పీడ్ ఇం టర్నెట్, డిజిటల్ క్లాస్ట్రూమ్ల ద్వారా బోధన సాగనుందని వివరించనున్నారు. అంతేకాకుండా, 9 నుంచి 12వ తరగతి విద్యార్థుల కోసం -ఐఐటీ, నీట్, జేఈఈ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఉపాధ్యాయులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేయనున్నారు.

లక్ష్యం 100 శాతం నమోదు..

బడి ఈడు పిల్లలందరినీ పాఠశాలల్లో చేర్పించడం, మధ్యలో బడి మానేసిన వారిని(డ్రాపౌట్స్) గుర్తించి మళ్లీ బడిబాట పట్టించడం, అంగన్వాడీ పిల్లలను ఒకటో తరగతిలోకి తీసుకురావడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశంగా టీచర్లు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అడ్మిషన్లను కనీసం 10 శాతం పెంచాలని ప్రభుత్వం ప్రతి ఉపాధ్యాయుడికి లక్ష్యంగా విధిం చినట్లు తెలిసింది. కార్యక్రమంలో బాగంగా గురువారం పాఠశాలల్లో గ్రాండ్ పేరెంట్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ నెల 21 నుంచి జూన్ 3 వరకూ అంగన్వాడీ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాలతో సమావేశాలు, ప్రచార ర్యాలీలు నిర్వహించనున్నారు. జూన్ 8 నుంచి 10 వరకు ఉపాధ్యాయులు, అధికారులు ఇంటింటికీ వెళ్లే డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు.

జూన్ 12 తర్వాత ప్రత్యేక కార్యక్రమాలు

జూన్ 12న పాఠశాలలు ప్రారంభ మైన తర్వాత వారం రోజుల పాటు పలు కార్యక్రమలు చేపట్టనున్నారు. జూన్ 12న విద్యార్థులకు ఘన స్వాగతం, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేయను న్నారు. 15న వేద పండితుల సమక్షంలో సామూ హిక అక్షరాభ్యాసం సైతం చేయనున్నారు. 16న పునాది అక్షరాస్యత దినోత్సవం చేయనున్నారు. 17న ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం సమ్మిళిత విద్యా అవగాహన నిర్వహించనున్నారు. జూన్ 18 హరితహారం, డిజిటల్ క్లాస్ట్రూమ్ ప్రదర్శన, 19న స్పోర్ట్స్ డే, గ్రామీణ క్రీడల నిర్వహణ నిర్వహించనున్నారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ప్రత్యేకంగా బడిబాట డెస్కులను ఏర్పాటు చేశారు. రోజూ నమోదైన అడ్మిషన్ల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కలెక్టర్లు, డీఈఓలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా బాలికల కోసం ఆత్మరక్షణ విద్య, మెన్స్ట్రువల్ హైజీన్, కెరీర్ గైడెన్స్ప ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు.