ఆధ్యాత్మికత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది

ఆధ్యాత్మికత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది
చౌటుప్పల్, ఆంధ్రప్రభ : శ్రీ పెరుమాళ్ళ ఆంజనేయస్వామి దేవాలయం అభివృద్ధియే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తానని దేవాలయం నూతన అధ్యక్షులు ముత్యాల భూపాల్ రెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని శ్రీ పెరుమాళ్ళ ఆంజనేయ స్వామి దేవాలయం నూతన పాలకవర్గం చేత మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, ఇన్స్పెక్టర్ జి మన్మధ కుమార్ ల సమక్షంలో ఎన్నికల ప్రత్యేక అధికారి బడుగు శ్రీరాములు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. శ్రీ పెరుమాళ్ళ ఆంజనేయ స్వామి దేవాలయం అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ.. దేవాలయాలలో ఆధ్యాత్మికత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందన్నారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నూతన దేవస్థానం అధ్యక్షుడిగా ముత్యాల భూపాల్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా అనమోని చంద్రయ్య, కే శివకుమార్, ప్రధాన కార్యదర్శిగా యెన్నం బాలరాజు, కోశాధికారిగా సామిడి రాఘవరెడ్డి, సాంస్కృతిక కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, మహిళా ప్రతినిధులు పదవి బాధ్యతలు చేపట్టారు. నూతన పాలకవర్గంను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో దేవాలయం మాజీ అధ్యక్షులు ముత్యాల హనుమంతరెడ్డి, ఉప్పు ఆంజనేయులు, కౌన్సిలర్ బుడ్డా సురేష్, మాజీ కౌన్సిలర్ పోలోజు శ్రీధర్ బాబు, ఎస్సై అజయ్ భార్గవ్, చేనేత సహకార సంఘం అధ్యక్షులు కందగట్ల బిక్షపతి, మాజీ మార్కెట్ చైర్మన్ బడుగు లక్ష్మయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షులు తాడూరి పరమేష్, మాజీ అధ్యక్షులు బాల్యం వెంకటాచలపతి, ప్రతినిధులు ఆలె చిరంజీవి, దేప రాజు, కడారి కల్పన ఐలయ్య యాదవ్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, దాచేపల్లి ప్రకాష్, చింతల వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
